nallasamachar.com

ఆశతో కాదు ఆశయం తో వస్తున్న

– మాటలతో కాదు పనులు చేసి చూపిస్తాం

– బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

– కొన్నే గ్రామ సర్పంచ్ అభ్యర్థి, మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల స్వప్న సాగర్

నవంబర్ 07, నల్లా సమాచార్ న్యూస్, బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో సర్పంచు ఎన్నికల వేడి కొనసాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్నే గ్రామ సర్పంచ్ అభ్యర్థి, మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల స్వప్న సాగర్ మాట్లాడుతూ, బ్యాట్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి తమను సర్పంచ్ గా గెలిపించాలని ప్రజల్ని కోరారు. సర్పంచిగా గెలిచిన వెంటనే కొన్నే గ్రామాన్ని మండలం చేయడానికి కృషి చేస్తానని, ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న కోతులు, కుక్కల బెడద, నుండి విముక్తి కల్పిస్తానని, అస్త వ్యస్థంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ను సవ్యంగా ఉంచడం, వీధి విద్యుత్ దీపాల పునరుద్ధరణ. తాగునీరు సమస్య సమూలంగా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు, వంటివి ముఖ్యంగా గ్రామాన్ని అభివృద్ధిలో వైపు నడుపుతానని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు.గ్రామ ప్రజలందరూ తమని ఆశీర్వదించి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *