nallasamachar.com

కొన్నే గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వండి

ప్రజాసేవకై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించి గెలిపించండి

డిసెంబర్ 07, నల్లా సమాచార్ న్యూస్, బచ్చన్నపేట :

తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికలు 2025 రెండో విడత ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో భాగంగా నిన్న అభ్యర్థులకు వారి ఎన్నికల గుర్తులు వెలువడగా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ లకు ఉంగరం గుర్తు కేటాయించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు తమ అభ్యర్థన వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం నిత్యం మీలో కలిసి ఉన్నామని, ప్రతి కుటుంబ ఆపదలో మీకు అండగా కొనసాగామని, గ్రామ ప్రజల సమస్యను నా సమస్య భావించి మీకు చేదోడుగా ఉన్నామని పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి సహాయం చేయడం కోసమైనా ముందంజలో ఉన్నామని, గత కొంతకాలంగా గ్రామంలో ఎవరికీ ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండి చేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా, పేదింటి పెళ్లిళ్లలో పెద్దనల, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు బాసటగా, దురదృష్టవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు అండగా, వయోవృధులకు చేతి కర్రల, ప్రతి ఇంట సుజల వాటర్ క్యాన్ల రూపంలో ఎల్లవేళలా సేవలో మీకోసం పనిచేశామన్నారు.

ఏలాంటి పక్షపాతానికి లోనవ్వకుండా, గ్రామానికి సర్పంచిగా గెలిపించి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి గ్రామ రూపులేఖలు మార్చే అవకాశం ఇవ్వాలని, ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని కోరారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *