Skip to main content

nallasamachar.com

హైడ్రా కొనసాగాలి – చెరువులు కాపాడాలి: తుమ్మిడ్కుంట సరస్సు వద్ద ర్యాలీ

మాదాపూర్ డివిజన్ హైటెక్ సిటీ పరిధిలోని తుమ్మిడ్కుంట సరస్సు వద్ద బుధవారం “హైడ్రా ఉండాలి – చెరువులు కాపాడాలి” అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెరువులు, కుంటలు, ఇతర జలవనరులు ప్రజల జీవనాధారమని, వాటిని ఆక్రమణల నుంచి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించడంలో హైడ్రా వంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలని, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. చెరువులు ఉంటేనే భవిష్యత్ ఉంటుందని వారు స్పష్టం చేశారు.చెరువుల సంరక్షణకు ప్రజల సహకారం అవసరంచెరువుల పరిరక్షణ రాజకీయ అంశం కాదని, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన బాధ్యత అని నాయకులు అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భావితరాల భవిష్యత్ కోసం చెరువులను శాశ్వతంగా రక్షించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చెరువుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, కాలనీవాసులు, టీం పట్వారీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *