nallasamachar.com

విఎస్ఆర్ నగర్ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వండి

– కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.

– కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన విఎస్ఆర్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గొడుగు రేణుక కమలకర్

తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికలు 2025 రెండో విడత ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో భాగంగా నిన్న అభ్యర్థులకు వారి ఎన్నికల గుర్తులు వెలువడగా బచ్చన్నపేట మండలం విఎస్ఆర్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోడుగు రేణుక కమలకర్ లకు కత్తెర గుర్తు కేటాయించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు తమ అభ్యర్థన వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం నిత్యం మీలో కలిసి ఉన్నామని, ప్రతి కుటుంబ ఆపదలో మీకు అండగా కొనసాగామని, గ్రామ ప్రజల సమస్యను నా సమస్య భావించి మీకు చేదోడుగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సహాయం చేయడం కోసమైనా ముందంజలో ఉన్నామని, గత కొంతకాలంగా గ్రామంలో ఎవరికీ ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండి చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా సేవలో మీకోసం పనిచేశామన్నారు. ఏలాంటి పక్షపాతానికి లోనవ్వకుండా, గ్రామానికి సర్పంచిగా గెలిపించి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి గ్రామ రూపులేఖలు మార్చే అవకాశం ఇవ్వాలని, కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని కోరారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *