nallasamachar.com

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఓసిల మహా ధర్నా విజయవంతం

దేశ రాజధాని ఢిల్లీలోనీ జంతర్ మంతర్ వద్ద సోమవారం రోజు ఓసి జేఏసీ తలపెట్టిన ఓసిలా మహా ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. అగ్రవర్ణాలుగా ముద్రపడి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోని నిరుపేద ఓసి ల హక్కుల కోసం, ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓసి లు కూడా ఈ దేశ పౌరులని, అందరిలానే వారికి కూడా ప్రభుత్వ అన్ని పథకాలు వర్తింపజేయాలని, అలాగే జాతీయస్థాయిలో ఓసి ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసి జేఏసీ రాష్ట్ర సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఓసీల స్థితిగతుల అధ్యయనంతో పాటు, ఈడబ్ల్యూఎస్ పకడ్బందీ అమలుకు గాను, ఓసి ల రక్షణ కొరకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 5 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉండాలని, అన్ని సామాజిక వర్గాలకు క్రీమ్ లేయర్ విధానాన్ని అమలు పరచాలని తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మించకుండా ఓసీ లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతు పండించే పంటలకు రైతే ధర నిర్ణయించే అధికారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షులు, పోలాడి రామారావు. ఓసి జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, ఓసి జెఏసి రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి, ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయనపల్లి వినోద్ రావు, ఓసి జేఏసీ నాయకులు, ఓసి వర్గాల ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *