Skip to main content

nallasamachar.com

మమ్మల్ని ఆదుకోండి

మమ్మల్ని ఆదుకోండి

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామ రైతుల పై పక్షపాతం ఎందుకు అని గ్రామ విజయ డైరీ చైర్మన్ గుత్తి సంపత్ కుమార్ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల చౌరస్తాలో కొన్నే గ్రామ పాడి రైతులు ధర్నా చేశారు. సుమారు గంట పాటుగా సాగిన ధర్నాలో గ్రామ విజయ డైరీ చైర్మన్ గుత్తి సంపత్ కుమార్ మాట్లాడుతూ కొన్నే గ్రామం నుండి జనగామ కు పాలు తరలించడం వల్ల రైతులు అన్ని రకాల సమస్యలకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటలకే లేచి పాలు తీసుకురావడం, ప్యాట్ తక్కువ రావడం, బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఎన్నిసార్లు ఈ విషయంపై మేనేజర్ డిడి ,సూపర్వైజర్ ,బీఎంసీ చైర్మన్కు, చెప్పిన సమస్య పరిష్కారానికి మార్గం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్కన ఉన్న జిల్లాల నుండి పాలు కొనుగోలు చేస్తున్నారు కానీ మా మండలం అయినా బచ్చన్నపేట మండల కేంద్రం కు ఉన్న పాల కేంద్రానికి మాపాలు ఎందుకు తీసుకోవడం లేదని మా గ్రామం అంటే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. దాదాపుగా 50 మంది రైతులు పాల్గొన్న ఈ ధర్నా సుమారు గంటసేపు కొనసాగింది. అనంతరం బీఎంసీ చైర్మన్ పూర్ణ జోగా రెడ్డి ,సూపర్వైజర్ నర్ర శ్రీనివాస్ రెడ్డి వచ్చి డిడి తో మాట్లాడడంతో రైతులకు రేపటినుండి పాలు బచ్చన్నపేట కేంద్రంకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ గ్రామ చైర్మన్ గుత్తి సంపత్ కుమార్, మాజీ చైర్మన్ ఎలీకట్టే శ్రీనివాస్, డైరెక్టర్లు మేకల స్వామి ,చెరుకు మల్లారెడ్డి, మల్గా సురేష్, పసుల విటల్, చేరవేణు, చల్ల రాజు, కలకుంట్ల కృష్ణ, పిట్టల కనకయ్య, శివకుమార్ ,గుత్తి సిద్ధిరాములు, మల్గ నాగరాజు, చెరకు శ్రీనివాస్ రెడ్డి, యాట నాగరాజు ,జూకంటి సురేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *