nallasamachar.com

కొన్నేలో సర్పంచ్ అభ్యర్థి వేముల స్వప్న విద్యాసాగర్ ప్రచార జోరు

  • గ్రామ ప్రజలకు పలు హామీలు
  • బ్యాట్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి

డిసెంబర్ 09, నల్లా సమాచార్ న్యూస్, బచ్చన్నపేట :

పంచాయతీ రెండవ దశ ఎన్నికలు ఈనెల 14న జరగనుండగా గ్రామాల్లో ప్రచార హోరు కొనసాగుతుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వేముల స్వప్న విద్యాసాగర్ ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామ అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలుకు ఇబ్బంది గురి చేస్తున్న ప్రతి సమస్యను పరిష్కారం దిశగా ముందుంటామని, ముఖ్యంగా వారి హామీల్లో గ్రామం నుండి పుల్లెగూడెం పోయే దారిలో అలాగే, ఇతర రైతులకు ఇబ్బంది గుర్తిస్తున్న ముఖ్యమైన బావిలకు అనుసంధానం చేసే బీటి రోడ్ల మరమ్మత్తు చేస్తానని తెలిపారు. గ్రామ రాకపోకులకు ఇబ్బంది కలిగిస్తున్న, వాగులపై పైప్ లైన్లతో దారులను ఏర్పాటు చేస్తామని, గ్రామంలో కోతులు, కుక్కల బెడద తొలగించడం, వంటి కార్యక్రమాలు చేపడుతాము అని ప్రజలకు తెలిపారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *