
డీసీసీ అధ్యక్షురాలిని కలిసిన కళాకారిణి శైలజ రమేష్
జన్మదినం సందర్భంగా డిసిసి అధ్యక్షురాలి ఆశీర్వాదం తీసుకున్న కళాకారిణి కళ్లెం శైలజ

నల్లా సమాచార్ న్యూస్, బచ్చన్నపేట :
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారిణి కళ్లెం శైలజ రమేష్ గురువారం తన పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కార్యాలయంలో అధ్యక్షురాలికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ధన్వంతి లక్ష్మీనారాయణ శైలజ రమేష్ తో కేక్ కట్ చేయించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “శైలజ మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో కళాకారులు తమ ఆటపాటలతో కీలక పాత్ర పోషించారని, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా గౌరవిస్తుందని భరోసా ఇచ్చారు.మహిళలకు ప్రాధాన్యం రాజకీయాల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలని, కాంగ్రెస్ పార్టీలో మహిళా శక్తికి తగిన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షుడు బెజగం నరేష్ తదితరులు పాల్గొన్నారు.