nallasamachar.com

చలో వరంగల్ ఓసి ల సింహగర్జనను జయప్రదం చేద్దాం

  • ఓసి జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి
  • ఓసి జేఏసీ చలో వరంగల్ సింహగర్జన సన్నహక సభ గోడ పత్రిక విడుదల
  • తెలంగాణ రాష్ట్ర ఓసీ జేఏసీ కార్యదర్శి కొడాలి శ్రీధర్ తో ఓసి జేఏసీ చలో వరంగల్ సింహగర్జన సన్నహక సభ లో నల్ల సంజీవరెడ్డి

నల్లా సమాచార్ న్యూస్, హైదరాబాద్ :

ఓసి జెఎసి ఆధ్వర్యంలో 2026 జనవరి 11 వరంగల్లో లో తలపెట్టిన చలో వరంగల్ ఓసిల సింహగర్జన సభ భారీ ఎత్తున తరలిరావాలని ఓసి జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఓసీ జేఏసీ కార్యదర్శి కొడాలి శ్రీధర్ తో పటాన్చెరు నియోజకవర్గం శ్రీ వాణి నగర్ డివిజన్ లోని, నందమూరి భవన్ లో ఏర్పాటు చేసిన ఓసి జేఏసీ చలో వరంగల్ సింహగర్జన సన్నహక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చినాటి నుండి అగ్రకులాలుగా ముద్ర వేసి ఆర్థికంగా, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ పథకాలు కొనసాగుతున్నాయి అన్నారు. అగ్రవర్ణాల్లో కూడా ఆర్థికంగా కడు పేదరికం అనుభవించే కటిక పేదలు ఎంతోమంది ఉన్నారని ఆయనే సందర్భంగా తెలిపారు. విద్య ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఎండగట్టారు. అందుకే జాతీయస్థాయిలో ఓసి జేఏసిని ఏర్పాటు చేయమని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జనగణన మాదిరిగానే ఓసి జన గణన జరిపి ఓసి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను, సర్వే చేసి రిజర్వేషన్లు నిర్వహించాలని ఆయన వ్యక్తపరిచారు. చలో వరంగల్ ఓసి జెఎసి సింహ గర్జన ముఖ్య డిమాండ్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,

1. ఓసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు.

2. ఓసి ఈడబ్ల్యూఎస్ జారీకి షరతులులేని 5 సంవత్సరాల కాలపరిమితి కలిగియుండాలి.

3. ఓసి ఈడబ్ల్యూస్ విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలి.

4. ఓసి ఈడబ్ల్యూస్ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

5. ఓసి ఈడబ్ల్యూఎస్ జారీకి ఆదాయ పరిమితి 8 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాలి.

6. ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు టెట్ రాత పరీక్ష అర్హతకు 90 మార్కుల నుండి 70 మార్కులకి తగ్గించాలి.

7. ఓసి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *