nallasamachar.com

ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు

ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు

  • తెలుగు సాహిత్యంలో వేమన శతకం కీర్తి కిరీటం
  • రాష్ట్ర ప్రభుత్వం యోగివేమన జయంతిని అధికారింగా నిర్వహించాలి.
  • ఓసి జేఏసీ, ఈడబ్ల్యూఎస్ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి

నల్లా సమాచార్ న్యూస్, శేరిలింగంపల్లి :

ప్రజా కవి యోగి వేమన జయంతి సందర్భంగా ఓసి జేఏసీ, ఈడబ్ల్యూఎస్ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన నాటి సమకాలిక సమాజ అసమానతలను, పరిస్థితులను చూసి తనదైన శైలిలో విశ్వదాభిరామ వినురవేమ అని ఎన్నో గొప్ప పద్యాలతో ప్రజలను చైతన్యపరిచి సమాజంపై యుద్ధం ప్రకటించిన గొప్ప కవి యోగి వేమ రెడ్డి అని పేర్కొన్నారు. ఎన్నో అద్భుతమైన పద్యాల ప్రభావం ఈరోజు వరకు ప్రజలపై సమాజంపై ఉంది అనడంలో అతిశయోక్తి లేదని అని, తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా నిలిచిపోయారని ఆయన అన్నారు. ప్రతి తెలుగు పాఠ్యపుస్తకల్లో వేమన శతకం రూపంలో ఆయన పద్యం ఉంటుందని తెలిపారు. వేమన శతకం తెలుగు సాహిత్యంలో కీర్తి కిరీటం అని అన్నారు. ఇంతటి మహనీయుని జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *