– నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్
నల్లా సమాచార్ న్యూస్, గజ్వేల్ :


నేటి వేగవంతమైన జీవనశైలిలో అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా ఎదురయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆరోగ్య బీమా అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజలకు విశ్వసనీయ ఆరోగ్య రక్షణను అందిస్తూ ముందంజలో నిలుస్తోంది.ఈ కార్యక్రమంలో నివా బుపా ఏజెన్సీ మేనేజర్లు అయినటువంటి నల్ల శ్రీకాంత్, సుకురి సామ్యుయేల్, శ్రీనివాస్ మరియు నరేందర్ పాల్గొని, నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలపై ప్రజలకు విపులంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నగదు రహిత చికిత్స, విస్తృత ఆసుపత్రుల నెట్వర్క్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్ వంటి అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఆరోగ్య బీమా పథకాలు కుటుంబాలకు సంపూర్ణ భద్రతను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యం అనేది అత్యంత విలువైన సంపద అని, ముందస్తుగా ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా అనుకోని వైద్య ఖర్చుల నుంచి రక్షణ పొందవచ్చని వారు సూచించారు. నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజల జీవితాల్లో నమ్మకమైన భాగస్వామిగా మారి, ఆరోగ్య భవిష్యత్తుకు భరోసా ఇస్తోందని తెలిపారు.