అహర్నిశలు గ్రామ అభివృద్ధి కోసమే పోరాడుతా
- గ్రామ అభివృద్ధికి తోడ్పడండి
- కొన్నే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పసుల మేఘమాల రాములు
- పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులు
- పేద ప్రజలకు సన్న బియ్యంతో కడుపు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు
- రైతులకు రెండు లక్షల రుణమాఫీ,
- అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అండతో గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం
డిసెంబర్ 11, నల్లా సమాచార్ న్యూస్, బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో తెలంగాణ పంచాయతీ 2025 రెండవ దశ ఎన్నికల ప్రచార పోరు కొనసాగుతుంది. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పసుల మేఘమాల రాములు కొన్నే గ్రామ ప్రజలకు తమ అభ్యర్థనను తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలనలో నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ, పేదలకు నూతన రేషన్ కార్డుల మంజూరు, లాంటి పలు కీలక నిర్ణయాలతో తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నైనా నన్ను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడి గ్రామ రాజకీయాల్లో కీలక మార్పు తీసుకొస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.