Skip to main content

nallasamachar.com

బాల్య వివాహ నిర్మూలన ప్రచార పోస్టర్‌ ఆవిష్కరణ..

బాల్య వివాహ నిర్మూలన ప్రచార పోస్టర్‌ ఆవిష్కరణ..

నవంబర్ 27, నల్లా సమాచార్ న్యూస్, జనగామ :

వందరోజుల “చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ భారత్” కార్యక్రమంలో జనగామ జిల్లా పరిపాలన కీలక నిర్ణయాలు చేపట్టింది. ఈ సందర్భంగా చైల్డ్ మ్యారేజ్‌ల నిర్మూలనకు సంబంధించిన ప్రత్యేక ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ, బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నివారణకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ అవగాహన ప్రచారాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లి, ప్రతి కుటుంబానికి చేరే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆదేశించారు.తరువాత జరిగిన కన్వర్జెన్సీ మీటింగ్ లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు — మహిళా & శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, ఐ సి డి ఎస్, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. అధికారులు చైల్డ్ మ్యారేజ్ నిరోధానికి తీసుకోవాల్సిన కింది చర్యలపై సమగ్ర చర్చ జరిపారు.గ్రామ/వార్డు స్థాయిలో వివాహాలపై పర్యవేక్షణ బలోపేతం,ఆంగన్‌వాడీ, స్కూల్ టీచర్లు ద్వారా ప్రమాదంలో ఉన్న బాలికల గుర్తింపు,చైల్డ్‌లైన్ సేవల వినియోగంపై ప్రచారం, యువతలో అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు,బాలికలకు విద్య & భద్రతపై విభాగాల మధ్య సమన్వయం, కలెక్టర్ అన్ని శాఖలు సంయుక్తంగా పని చేస్తే జిల్లాను “చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్” గా మార్చడం సాధ్యమని నమ్మక వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి చైర్మన్ ఉప్పలయ్య, డిఆర్ డి ఓ వసంత, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ ఆఫీసర్ మాధవి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ విక్రమ్ కుమార్, ఏడి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫీసర్ చౌడేశ్వరి, సిడిపిఓల సత్యవతి, డి సి పి ఓ రవికాంత్, మిషన్ శక్తి కోఆర్డినేటర్ శారద, చైల్డ్ కోఆర్డినేటర్ రవికుమార్, సఖి సెంటర్ కోఆర్డినేటర్ రేణుక, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపరిండెంట్ సంపత్,జస్ట్ రైట్స్ చిల్డ్రన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మనోజ్ కుమార్ మరియు అంగన్వాడి సూపర్వైజర్స్ అంగన్వాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *